Excel | Excel Introduction In Telugu | Excel Basics In Telugu

కొత్తగా ఏదైనా subject నేర్చుకోవాలి అనుకుంటే ముందుగా Basics తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైన ఉంది. Basics గురించి అవగాహన కలిగి ఉండడం వలన Subject నేర్చుకోవడం తేలిక అవుతుంది. Excel  గురించి Introduction, Excel Basics ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

Excel Introduction: 

ముందుగా Excel అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. Excel అనేది Microsoft సంస్థ అభివృద్ధి చేసిన Spreadsheet Program. దీనిని ఏ Operating Systemలో అయిన Use చేయవచ్చు(Operating System అనగా Windows, Mac, Android, etc,...).

Excel అనేది వివిధ రకాల Options మరియు Functionsని కలిగి ఉండే భారీ Applications. ఇందులో Functions మరియు Formulas Use చేసి Workని Easy చేయొచ్చు. Pivot Charts, Normal Charts మరియు Pivot Tables కూడా Create చేయవచ్చు. అదేవిధంగా Data Analysisలో భాగమైన Sort, Filter, Subtotal, వంటి మరెన్నో Options ఇందులో అందుబాటులో ఉన్నాయి.   

Excel Basics: 

Excelని Properగా Use చెయ్యాలంటే  Excelని Open చేయగానే మనకు కనిపించే Options గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

ముందుగా Excel Screen అనేది Open చేయగానే కింద చూపిన విధంగా 3 Sheetsతో Blank Work Book Open అవుతుంది. దీనికి అదనంగా  Sheets Add చేయాలి అనుకుంటే Add చేయొచ్చు మరియు ఉన్న Sheetsని Delete చేయాలి అనుకుంటే Delete చేయొచ్చు. అదేవిధంగా  ఒక Work Bookలో అన్ని Sheet Namesని ఒకేసారి చూడాలి అనుకుంటే Sheet1 పక్కనే ఉన్న Right Arrow పైన Right Click చేస్తే Sheet Names అన్ని కనిపిస్తాయి.   

Excel Blank Work Book

Quick Access Tool Bar:

Excel Screenపై అన్నింటి కన్న పైన మనకు Quick Access Tool Bar కనిపిస్తుంది. 

Quick Access Tool Bar

Quick Access Tool Bar ని ఉపయోగించి మన Workని Fastగా Complete చేయొచ్చు. మనకు కావలిసిన Commandsని Quick Access Tool Barపైన Add చేసుకోవచ్చు. 

Quick Access Commands

Quick Access Tool Bar Cornerలో ఉన్న Arrowపైన Click చేస్తే కొన్ని Options కనిపిస్తాయి. 

Customize Quick Access Tool Bar

వచ్చిన Optionsలో More Commands పైన Click చేస్తే  Quick Access Tool Bar యొక్క Customized Window Open అవుతుంది.

Quick Access Tool Bar Command

Quick Access Tool Barలో ఏదైనా Commandని Add చేయాలనుకుంటే Choose Commands From అనే వైపు మనకు నచ్చిన Optionని Select చేసి Add అనే Option పైన Click చేసి OK Button పైన Click చేస్తే Quick Access Tool Bar పైన Add అవుతుంది. Quick Access Tool Barలో ఉన్న Commandని వద్దనుకుంటే  Customize Quick Access Tool Bar అనే వైపు వద్దనుకుంటున్న Optionని Select చేసి Remove అనే Option పైన Click చేసి OK Button పైన Click చేస్తే Quick Access Tool Bar నుంచి తొలిగించవచ్చు. 

Tabs:

Quick Access Tool Bar క్రింద Home, Insert, Page Layout, Formulas, Data, Review, View, Developer అని విభిన్న Tabs ఉంటాయి ఈ Tabsని Menu Bar అని కూడా అంటారు. ప్రతి Tab విభిన్న Ribbons కలిగి ఉంటుంది. ప్రతి Ribbon విభిన్న Options కలిగి ఉంటుంది.

 Tabs


    Ribbons Optionని Double Click చేసి Hide చేయొచ్చు. అదే విధంగా Double Click చేసి Hide అయిన Ribbonని Unhide చేయవచ్చు. ఒక్కొక్క Ribbonకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే Ribbonలో ఉండే ఒక్కొక్క Optionకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.     

Hide Ribbon

Name Box: 

Ribbon Option కి కొంచెం కింద ఉండే Boxని Name Box అని అంటారు. మనం Cursor ఏ Cellలో ఉంచితే ఆ Cell Name చూపిస్తుంది. ఉదాహరణకు Column 'A' Row '1' అనే Cellవద్ద ఉంది కావున A1 అని చూపిస్తుంది. అదే Column ''E' Row '2' వద్ద ఉంటె Name Boxలో E2 అని చూపిస్తుంది.   

Name Box

Formula Bar:

Name Box పక్కనే Formula Bar ఉంటుంది. Cellలో ఏం Type చేసిన Formula Barలో కనిపిస్తుంది. Formula Barకి Cornerలో ఉన్న Down Arrow ఉపయోగించి Open చేయొచ్చు మరియు Minimize చేయొచ్చు.

Name Boxకి కొంచెం కింద A, B, C,... అని ఉన్న Headingsని Columns అని అంటారు. మరియు 1, 2, 3,.... అని ఉన్న headingsని Rows అని అంటారు. Row మరియు Column కలిపి Cell అని అంటారు. 

Row Heading పైన Click చేస్తే మొత్తం Row Select అవుతుంది. 

Row

అదేవిధంగా Column Heading పైన Click చేస్తే మొత్తం Column Select అవుతుంది. 

Column

Defaultగా  Vertical Scroll Bar, Horizontal Scroll Bar ఉంటాయి. Vertical Scroll Bar ఉపయోగించి Screenని కిందకి పైకి జరపవచ్చు. Horizontal Scroll Bar ఉపయోగించి Screenని కుడి వైపుకి మరియు ఎడమ వైపుకు జరపవచ్చు. Horizontal Scroll Bar కింద Screen Zoom Scroll Bar ఉంటుంది. Screen Zoom Scroll Barలో '+' Signని ఉపయోగించి Cell Sizeని పెంచవచ్చు. '-' Signని ఉపయోగించి Cell Sizeని తగ్గించవచ్చు. పైన Right Side Cornerలో Minimize, Maximize, Close Buttons ఉంటాయి.  




 

Comments

Popular posts from this blog

Easy Typing | Telugu Typing | Translator

Download YouTube Videos On Gallery || YouTube Downloader